Story Joner: Drama, Slice Of Life.
Characters: Srinu, a farmer.
Vikram, A working professional.
Story Line: A day in two different persons lives, how they come up with huddles, and how they coordinate with each other.
Vikram: వర్క్ ఫ్రొమ్ home ప్రొఫషనల్ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏమి చేయాలో అర్థం కాకా తాను చనిపోవాలి అని నిర్ణయం తీసుకుంటాడు. ఫ్యాన్ కి ఉరి వేసుకోవాలని నిర్ణయించుకొని తాడు కోసం ఇలంతా వెతికి ఒక తాడు తెచ్చుకొని స్టూల్ వేసుకొని దానిపైకి ఎక్కి తాడు కడుతూ ఉండగా పక్కన వున్నా కిటికీ లో నుంచి ఒక్క మధ్య వయస్సు గల రైతు తన పొలం లో ఒంటరిగా పని చేసుకుంటూ కనిపిస్తాడు. అప్పుడు విక్రమ్ మన్నస్సులో అనుకుంటాడు ఆ రైతు చూడు ఎంత హ్యాపీ గా వున్నాడో కానీ నేను ఈలా చి చీ... అనుకుంటూ తన రోజు వారి దిన చేర్య ఎలా మొదలవుతుందో ఊహించుకుంటాడు.
వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫెషనల్, తన సొగసైన అపార్ట్‌మెంట్‌లో మేల్కొంటాడు. అతని ఉదయపు దినచర్యలో కాఫీ చేయడం, అతని డెస్క్ వద్ద కూర్చోవడం మరియు అతని ల్యాప్‌టాప్ తెరవడం ఉంటాయి. సాయంత్రానికి అతని కళ్ళు అలసిపోయాయి, కానీ అతను తన వర్చువల్ సమావేశాలలో టైప్ చేస్తూ నిరాశ పడూతూ మేనేజర్ ఇస్తున్న టాస్క్స్ పూర్తి చేసుకోలేక చివాట్లు పడుతూ, జీవితం లో సంతోషం అనేది లేక అలసి, నిరాశకు గురై, రేపు మల్లి ఏమి జరుగుతుందో అనే బాధ, భయం తో అతని రోజు ముగుస్తుంది.
ఇది కాదు నేను ఆశించిన జీవితం అనుకోని, ఒక్క సారి ఆ రైతు ని కలవాలి ఆలా కలసి అతని అడగాలి అసలు అయన ఇంత హ్యాపీ గా ఎలా ఉండగలుగుతున్నాడో కనుకోవాలి అనుకునే లోపే కరెంటు పోతుంది. ఇక విక్రమ్ చేసేది ఏమి లేక కిందకు దిగి ఆ రైతు ని కలుద్దామా వద్ద అనే సందేహం తో ఆలా తన వరండాలో తిరుగుతున్నాడు. ఇంతలో ఆకాశం అంత నల్లటి వాన మబ్బులు పట్టేసాయి. విక్రమ్ ఫోన్లో తుఫాను హెచ్చరిక రావడం తో ఇంక ఈ రోజు కరెంటు రాదు అని ఫిక్స్ అయ్యి చేసేది ఏమి లేక ఆలా తన వరండ నుండి బయటకి వచ్చి మెల్లగా ఆ రైతు పొలం వైపు అడుగులు వేసెను. విక్రమ్ ఆ రైతు పొలం దెగ్గరకు వెళ్ళగానే ఆ రైతు విక్రమ్ ని చూసి చిన్నగా నవ్వేను. ఆ రైతు నవ్వుకు విక్రమ్ కి చిరునవ్వు తోనే సమాధానము చెప్పెను.
విక్రమ్ ఆ రైతుని చూసి నేను రావచ్చా మీ పొలం లోకి అని అడుగగా ఆ రైతు అయ్యో ఎంత మాట దయచేసి రండి అని ఎంతో ఆప్యాయతగా పిలిచెను. తన పేరు శ్రీను తాను ఒక సాధారణ రైతు అని చెప్పెను అతని మాటలకూ నా పేరు విక్రమ్, నేను ఒక మాట అడుగవచ్చా అన్నాడు, రైతు అడగండి అన్నాడు. విక్రమ్ నేను మీకు తెలుసా, మనం ఎప్పుడైనా కలిసామా అన్నాడు దానికి ఆ రైతు లేదు అండి మిమల్ని చూడం ఇదే మొదటిసారి అన్నాడు. పరిచయం కూడా లేని వక్తితో ఈలా ఎలా ప్రేమగా మాట్లాడగలుతున్నారు అని విక్రమ్ అడుగనే అద, మీ పొలం లోకి రావచ్చా అని మీరు అడిగినప్పుడు ఒక రైతు పడుతున్న కష్టాన్ని మీరు చూడడానికీ వచ్చారు అని అర్థం అయింది. కష్టం తెలిసినవాడు, కష్టపడేవాడు, కష్టానికి విలువ ఇచ్చేవాడు ఆ భావంతునితో సమానం అని నేను భావిస్తాను అండి. భగవంతునితో మనం కోపంగా మాట్లాడలేము కదండీ అని ఆ రైతు అనగానే విక్రమ్ నిజంగా అంత కష్టం వుంటుందా!
శీను గారు నేను ఉదయం లేచిన దెగ్గర నుంచి రాత్రి పడుకునే దాకా రకరకాల మీటింగ్స్, కాల్స్, ఆన్లైన్ వర్క్స్, క్లయింట్ మీటింగ్స్, వీటి అన్నిటితో పాటు పర్సనల్ కాల్స్, సోషల్ మీడియా అప్డేట్లు, అసలు నా పనిలో మానవ సంబంధాలు లేకుండా పోయి జీవితం ఒక యంత్రం లాగా తయారు అయింది. కానీ మీ లైఫ్ ఆలా కాదు ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా గడుపుతారు మీ జీవితాన్ని, చూడు విక్రమ్ ఎవ్వరికీ తగ్గ కష్టాలు వారికీ ఉంటాయి, కానీ కష్టాలు వచ్చాయి కదా అని ప్రయత్నాన్ని, పని చేసే తత్వాన్ని మానకూడదు, ఆలా అనిపించినప్పుడు పనిని మానటం కాదు, పని చేసే విధానాన్ని మార్చాలి అప్పుడే మనము సంతోషం గా ఉండగలం మనం చేసే పనిలో కొత్తదనాన్ని వెతుకోగలం, అయినా మీరు అనుకున్నట్టు నా జీవితం అంత సంతోషం గా ఏమి సాగిపోవడం లేదు.
వేకువజామునే పొలం కి పోయి అక్కడ ఊహించని వాతావరణాన్ని ఎదుర్కోవాలి, ప్రతి రోజు సహకరించని ప్రకృతి ని ప్రసన్నం చేసుకోవాలి, అంతే కాకుండా పొలం లో కలపని, క్రిమి కీటకాలని నివారించాలి, సరిగా పని చేయని ట్రాక్టర్ని వాటితో పాటు పని చేయడానికి వచ్చిన కూలీల తో సరిగ్గా పని చేయించుకోవాలి.
ప్రతి రోజు చేస్తున్న పనే అయినా నేను చక్కటి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ, నెల తల్లిని తాకుతూ, పచ్చటి పొలంలో గాలికి అనుగుణంగా ఊగిసలాడే పైరునిచూస్తూ నా కష్టం లో కుడా సూఖన్ని వెత్తుకుంటా.
విక్రమ్ శ్రీను చెప్పిన మాటల్ని శ్రాధగా విని తాను ఉదయం తీసుకున్న నిర్ణయం ఎంత తప్పో అర్థం చేసుకున్నాడు. ఇంతలో చిన్నగా చినుకులు మొదలైనాయి శ్రీను విక్రమ్ తో నాకు కాస్త సాయం చేస్తావా అన్నాడు విక్రమ్ చెప్పు శ్రీను అన్నాడు. వర్షం పెద్దది అయేలోపు గాలికి రాలిపోయిన కూరగాయలు కాస్త ఎరాలి అన్నాడు అప్పుడు శ్రీను విక్రమ్ ఇద్దరు నీవు ముందా నేను ముందా అన్నట్టు ఆడుకుంటూ సరదాగా పొలం లో పడ్డ కూరగాయలు ఏరుకున్నారు.
వర్షం పెద్దదయింది ఇద్దరు ఒక పెద్ద చెట్టుకిందకు చేరుకున్నారు అప్పుడు విక్రమ్ శ్రీను తో థాంక్స్ శ్రీను గారు అంటాడు శ్రీను కి ఏమి అర్థం కాక ఎందుకండీ అంటాడు అప్పుడు విక్రమ్ మీ మాటలు నన్ను ఎంతగానో ప్రభావితం చేసినాయి జీవితం పై నాకున్న దృష్టికోణాన్ని పూర్తిగా మార్చేసింది. ఇక మీదట నా పనిలో కూడా నేను సొంతోషాన్ని వెత్తుకుంటాను అన్నాడు. నాది ఒక చిన్న మనవి నాకు ఎప్పుడైనా కాస్త టైం దొరికితే నేను మీ దెగ్గరికి వచ్చి మీ పొలం లో కాసేపు మీతో కలసి పని చేయొచ్చా అని విక్రమ్ శ్రీను ని అడిగెను అప్పుడు శ్రీను తప్పకుండ రండి అని చెప్పను. ఇంతలో తుఫాను వెళ్ళిపోయి వర్షం ఆగిపోయినది.
కొత్త స్నేహితుడు దొరికిన ఆనందంలో శ్రీను ఇంటికి మరియు చేస్తున్న పనిని ఎలా ప్రేమించాలో తెలుసుకున్న విక్రమ్ తన ఫ్లాట్ కి వెళ్లిపోయారు.
ఇద్దరు వ్యక్తుల ప్రపంచాలు వేరు, చేస్తున్న పనులు వేరు.
చేస్తున్న పని ఏదైనా చేసే విధానం లో వైవిద్యం ఉన్నప్పుడే పనిలో అయినా జీవితంలో అయినా విజయం మీ సొంతం.
- THE END -